This Day in History: 1979-02-02
1979 : షమితా శెట్టి జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్, ఇంటీరియర్ డిజైనర్, సామాజిక కార్యకర్త. ప్రముఖ నటి శిల్పాశెట్టి చెల్లెలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం డబ్బును సేకరించేందుకు శెట్టి ఛారిటీ ఫ్యాషన్ షో కేరింగ్ విత్ స్టైల్ కోసం ర్యాంప్‌పై నడిచింది. సేవ్ ది గర్ల్ చైల్డ్ ప్రచారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన సోషల్ కాజ్ మ్యూజిక్ వీడియో బెటియాన్లో ఆమె నటించింది. హిందీ, తెలుగు, తమిళ భాషలలొ పనిచేసింది. మొహబ్బతేన్లో హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. బిగ్ బాస్ 3 లో 42 రోజులు ఉంది, బిగ్ బస్ ఓటీటీ 2వ స్థానం, బిగ్ బస్ 15 లో 3వ స్థానం, ఖత్రోన్ కే ఖిలాడీ 9 లో 4 వ స్థానం సంపాదించింది. వెబ్ సిరీస్, మ్యూజిక్ విడియోలలో పనిచేసింది. ఐఐఎఫ్ఎఎ అవార్డు అందుకుంది.