This Day in History: 2022-02-06
2022 : భారతరత్న లతా మంగేష్కర్ (హేమా మంగేష్కర్) మరణం. భారతీయ నేపథ్య గాయని, సంగీత స్వరకర్త, సినీ నిర్మాత, సంగీత దర్శకురాలు. ఆమె భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరు. నైటింగేల్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఆఫ్ ది మిలీనియం, క్వీన్ ఆఫ్ మెలోడీ వంటి గౌరవ బిరుదులను పొందింది. హిందీ, మరాఠీ ప్రధానంగా 36 భారతీయ భాషలలో మరియు కొన్ని విదేశీ భాషలలో పాటలను రికార్డ్ చేసింది. 1960లలో, ఆమె సరాసరి 30,000 పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను గెలుచుకుంది. గాయని ఆశబోస్లే ఈమె చెల్లెలు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయురాలు. ఎంఎస్ సుబ్బులక్ష్మి తర్వాత భారతరత్న గౌరవాన్ని అందుకున్న రెండవ మహిళా గాయని. ఔట్‌లుక్ ఇండియా యొక్క గ్రేటెస్ట్ ఇండియన్ పోల్‌లో మంగేష్కర్ 10వ స్థానం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఆమె గౌరవార్ధం మంగేష్కర్ అవార్డులను నెలకొల్పాయి. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఎన్టీఆర్ నేషనల్, ఎఎన్ఆర్ నేషనల్, మహారాష్ట్ర భూషణ్ లాంటి అవార్డులతో పాటు అనేక గౌరవ పురస్కారాలు పొందింది.