2018-03-14 – On This Day  

This Day in History: 2018-03-14

2018 : స్టీఫెన్ విలియం హాకింగ్ మరణం.సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు. మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చి డైరెక్టరుగా ఉన్నాడు. 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది. కొన్ని దశాబ్దాల్లో అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడిపోయాయి. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలకు (బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ, దానికి అమర్చిన సంభాషణలు-ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు. బిబిసి వారి 100 మంది అత్యంత గొప్ప బ్రిటిషర్ల జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. ఆయన రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ద బ్రిటీష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాయి.

1975 ఎడిటంగ్ మెడల్, 1976 రాయల్ సొసైటి హ్యుగ్స్ మెడల్, 1979 అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్, 1982 ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్), 1985 రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ బంగారు పతకం, 1986 పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం, 1988 భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి, 1989 కన్ కర్డ్ లో ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్, 1989 కంపానియన్ ఆఫ్ ఆనర్, 1999 అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్, 2003 కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్, 2006 రాయల్ సొసైటీ కాప్లి మెడల్ లతో పాటు అనేక ఇంటర్నేషనల్ గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share