This Day in History: 1989-04-20
1989 : మిస్ అమెరికా నీనా దావులూరి జననం. భారతీయ అమెరికన్ పబ్లిక్ స్పీకర్, న్యాయవాది. ‘మిస్ న్యూయార్క్’, ‘మిస్ అమెరికా’ కిరీటం గెలుచుకున్న మొదటి భారతీయ అమెరికన్. జీ టీవీ అమెరికాలో మేడ్ ఇన్ అమెరికా అనే రియాలిటీ షోకి హోస్ట్. మిస్ అమెరికా కిరీటం పొందిన రెండవ ఆసియా అమెరికన్ కూడా ఆమె. మిస్ అమెరికా 2014, మిస్ న్యూయార్క్ 2013, మిస్ సిరక్యూస్ 2013 సెకండ్ రన్నరప్, మిస్ న్యూయార్క్ 2012, మిస్ గ్రేటర్ రోచెస్టర్ 2012 ఫస్ట్ రన్నరప్, మిస్ అమెరికాస్ అత్యుత్తమ టీన్ 2007, మిస్ మిచిగాన్స్ అత్యుత్తమ టీన్ 2006, మిస్ సౌత్ వెస్ట్ మిచిగాన్స్ 2005 విజేత గా నిలిచింది.
