1997-04-29 – On This Day  

This Day in History: 1997-04-29

1997 : పద్మ భూషణ్ ఆర్ ఎన్ మల్హోత్రా (రామ్ నారాయణ్ మల్హోత్రా) మరణం. భారతీయ ఆర్ధికవేత్త, అధికారి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా 17వ గవర్నర్. ఆయన 1985 ఫిబ్రవరి 4 నుండి 1990 డిసెంబరు 22 వరకు గవర్నర్ గా సేవలనందించాడు.

మల్హోత్రా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో సభ్యుడు. రిజర్వు బ్యాంకులో గవర్నరుగా రావడానికి పూర్వం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారత ఎగ్జిక్యూడివ్ డైరక్టరుగా, ఆర్థిక సెక్రటరీగా కూడా పనిచేసాడు. ఆయన పదవీ కాలంలో 500 రూపాయల నోటుని పరిచయం చేసాడు. 1986 8hq A 50 రూపాయల నోటుపై సంతకం చేసాడు. 1990లో పద్మభూషణ పురస్కారాన్ని పొందాడు.

ఆయన భార్య అన్నా రాజం మల్హోత్రా భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో మొదటి మహిళ.

Share