This Day in History: 1597-01-19
1597 : మహారాణా ప్రతాప్ (ప్రతాప్ సింగ్ 1) మరణం. సిసోడియా రాజవంశానికి చెందిన మేవార్ హిందూ రాజ్‌పుత్ర కుటుంబానికి చెందిన 13వ రాజు.
1572లో ఉదయ్ సింగ్ II మరణానంతరం, మహారాణా ప్రతాప్ ఆయన తర్వాత మేవార్ పాలకుడైనాడు. 1576 జూన్ 18న మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు మహారాణా ప్రతాప్ దళాల మధ్య హల్దీఘాటి యుద్ధం జరిగింది. మేవార్ సైన్యానికి గణనీయమైన ప్రాణనష్టం కలిగింది. కాని మహారాణాను పట్టుకోలేక పోయారు. 1579లో మహారాణా ప్రతాప్ తన బలగాలను సేకరించి మేవార్ ప్రాంతంలోని కోల్పోయిన భాగాలను మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
