This Day in History: 1971-05-29
1971 : పద్మ భూషణ్ పృధ్వీరాజ్ కపూర్ (పృథ్వీనాథ్ కపూర్) మరణం. భారతీయ పాకిస్తానీ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందీ సినిమా వ్యవస్థాపకులలో ఒకరిగా కూడా పరిగణించబడ్డాడు.
కపూర్ వంశ పితామహుడు. ఆయన IPTA దాని వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. బొంబాయిలో ట్రావెలింగ్ థియేటర్ కంపెనీగా 1944 లో పృథ్వీ థియేటర్లను స్థాపించాడు. రాష్ట్రపతి మెడల్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, సంగీత నాటక అకాడమీ అవార్డు లాంటి పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.
