This Day in History: 1983-06-15
1983 : శ్రీశ్రీ (పూడిపెద్ది శ్రీనివాసరావు) మరణం. భారతీయ ప్రముఖ తెలుగు కవి, రచయిత, హేతువాది, నాస్తికుడు, సినీ నిర్మాత. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోగా ఆయన ఇంటిపేరు శ్రీరంగం గా మారింది. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధుడు. మహాప్రస్థానం అతని రచనల్లో ప్రసిద్ధమైనది. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై ప్రతిష్ఠించారు.
