This Day in History: 1915-02-02
1915 : పద్మ విభూషణ్ కుష్వంత్ సింగ్ (ఖుషాల్ సింగ్) జననం. భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు, చరిత్రకారుడు. సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు. ఆయన యోగన పత్రికకు సంపాదకుడిగానూ, ‘ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’, ‘ద నేషనల్ హెరాల్డ్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ లకు సంపాదకత్వం వహించాడు. రాక్‌ఫెల్లర్ గ్రాంట్, పద్మభూషణ్, హానెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సులభ్ ఇంటర్నేషనల్, పంజాబ్ రట్టన్ అవార్డు, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్, ఆల్-ఇండియా మైనారిటీస్ ఫోరమ్ వార్షిక ఫెలోషిప్, టాటా లిటరేచర్ లైవ్ జీవితకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ కల్పనకు ‘ది గ్రోవ్ ప్రెస్ అవార్డు’లు లభించాయి.