This Day in History: 1715-08-02
తిరుపతిలోని తిరుమల కొండపై వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రంలో ప్రసాదం గా లడ్డూను ప్రవేశపెట్టారు.
2 ఆగస్టు 1715న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో శ్రీ వెంకటేశ్వర స్వామికి లడ్డూలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది. తిరుపతి లడ్డూ యునెస్కో నుండి జిఐ ట్యాగ్ (Geographical Indication Tag) కూడా పొందిన ప్రత్యేకత కలిగిన ప్రసాదం.
తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది. తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లోని శాసనాలను బట్టి క్రీశ830 నాటికే తిరుమల ఆలయంలో అనేక ప్రసాదాల నివేదనలు జరిగాయి.
మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. 1843 -1933 మధ్య కాలంలో తిరుమల ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో తీపి బూంది ప్రసాదాన్ని ‘మనోహరం’ పేరుతో చలామణిలోకి తెచ్చారు.
1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.
