1906-10-02 – On This Day  

This Day in History: 1906-10-02

1906 : రాజా రవి వర్మ మరణం. భారతీయ చిత్రకారుడు, సంస్కృత పండితుడు. ఆధునిక భారతీయ కళ పితామహుడు. రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలను చిత్రాలుగా మలచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి ఆయన చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రింకరించాడు. ఈయన చిత్రాలు కొన్ని అశ్లీలంగా ఉంటాయి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. కైసర్-ఇ-హింద్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. కేరళలోని మావెలికరలో అతని గౌరవార్థం లలితకళలకు అంకితమైన కళాశాల స్థాపించబడింది. భారతదేశం అంతటా రవివర్మ పేరును కలిగి ఉన్న అనేక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. ఆయన గౌరవార్థం మెర్క్యురీపై వర్మ అనే బిలం పేరు పెట్టబడింది. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ పురస్కారం అవార్డును నెలకొల్పింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share