This Day in History: 1984-12-02
1984 : భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 30 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత విషపూరిత వాయువులు విడుదలవడంతో 25,000 మందికి పైగా మరణించారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం 3000 మంది మరణించారు. 5 లక్షల మందికి పైగా కేన్సర్, కిడ్నీ వైఫల్యం, కాలేయ, చర్మ వ్యాధులు లాంటి భయంకర వ్యాధుల బారినపడ్డారు. వేలకొద్దీ జంతువులు, పక్షులు చనిపోయాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. కంపెనీ ఛైర్మన్ వారెన్ అండర్సన్, ప్రభుత్వ విమానంలో అమెరికా పారిపోయాడు.