This Day in History: 1982-12-03
1982 : పద్మశ్రీ మిథాలి దొరై రాజ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారిణి, క్రికెట్ కెప్టెన్, నృత్యకారిణి. రైల్వే ఉద్యోగిణి. తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. ఇంగ్లాండుపై జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, పద్మశ్రీ లతో పాటు అనేక పురస్కారాలు, అవార్డులు లభించాయి.