This Day in History: 1643-01-04
1643 : సర్ ఐజాక్ న్యూటన్ జననం. ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త. ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. ఆయన రాసిన గ్రంధం “సహజ తత్వశాస్త్రం యొక్క గణిత సూత్రాలు” సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. ఈయన పుట్టేనాటికి ఇంగ్లండ్ లో క్యాలెండర్ మారలేదు. అందువల్ల డిసెంబర్ 25 1642 పుట్టిన దినంగా ఉండేది. క్యాలెండర్ మారిన తరువాత జనవరి 4 1643 కి వెళ్ళింది.