1916-05-05 – On This Day  

This Day in History: 1916-05-05

1916 : జ్ఞాని జైల్ సింగ్ (జర్నైల్ సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదశ 7వ రాష్ట్రపతి. పంజాబ్ 9వ ముఖ్యమంత్రి. రాష్ట్రపతి పదవిని నిర్వహించిన మొదటి సిక్కు. సిక్కుమతానికి చేసిన కృషికి ‘జ్ఞాని’ బిరుదు పొందాడు. 1956 లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1962 లో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేసాడు. 1972 మార్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు. 1980 జనవరి లో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share