This Day in History: 1723-06-05
1723 : ఆడం స్మిత్ జననం. స్కాటిష్ ఆర్థికవేత్త, తత్వవేత్త. అర్థశాస్త్ర పితామహుడు. రాజకీయ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకుడు. స్కాటిష్ విశదీకరణం సమయంలో కీలక వ్యక్తి. 1776లో రచించిన వెల్త్ ఆప్ నేషన్స్ గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడం స్మిత్ స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి దారీ విధానం, లిబర్టిలిజం లపై అనేక రచనలు చేసాడు. అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు వారి వల్ల ప్రభావితుడయ్యాడు. స్కాటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్‌తో పరిచయం అతని ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి దోహదపడింది.