1986-09-05 – On This Day  

This Day in History: 1986-09-05

Neerja Bhanot హైజాకింగ్ హీరోయిన్
నీర్జా భానోట్ 🔴
మరణం.
భారతీయ ఫ్లైట్ అటెండెంట్, మోడల్.
అశోక చక్ర పొందిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు.

1986 సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన పాన్ యామ్ ఫ్లైట్ 73 హైజాక్ సంఘటనలో అసాధారణ ధైర్యం చూపించింది.

అబూ నిదాల్ సంస్థకు చెందిన నలుగురు సాయుధ పాలస్తీనా ఉగ్రవాదులు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో బోయింగ్ 747-121 విమానాన్ని హైజాక్ చేశారు.

ఈ విమానం ముంబై నుండి న్యూయార్క్‌కు వెళ్తూ కరాచీలో ఆగింది.

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తెరిచి మొదట పారిపోవలసిన వ్యక్తి ఆమె అయినప్పటికీ ప్రయాణికులు తప్పించుకునేందుకు సహాయం చేసింది.

అది గమనించిన హైజాకర్లు  ఆమె జుట్టు పట్టుకొని తలపై పాయింట్ బ్లాక్ లో కాల్చారు.

ఆమె పేరు మీద నీర్జా భానోట్ ట్రస్ట్ స్థాపించబడినది.

పాకిస్తాన్ నుండి తమ్గా-ఎ-పాకిస్తాన్ (ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు) మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి స్పెషల్ కరేజ్ అవార్డు సహా ఇతర పురస్కారాలు కూడా అందుకుంది.

Share