This Day in History: 1965-09-06
1965 : భారత సైనికులు పశ్చిమ పాకిస్థాన్ పై దాడి చేశారు. భారత దళాలు బర్కి అనే గ్రామం వద్ద కాలువ దాటాయి. ఈ గ్రామం లాహోర్‌కు చాలా దగ్గరలో, తూర్పున ఉంది. కాని పాక్ దళాలు భారత భూభాగం లోని ఖేమ్ కరన్ ను దాని చుట్టుప్రక్కల గ్రామాలనూ ఆక్రమించుకున్నాయి. పాక దళాల దృష్టిని ఖేమ్ కరణ్ నుండి మళ్ళించేందుకు భారత్ పాక్ లోని బేడియాన్ గ్రామం పైన, దాని చుట్టుపక్కల గ్రామాలపైనా దాడి చేసింది. దీనంతటికి ఒక వారం ముందు భారత భూభాగంలోకి పాక్ సైనికులు జరిపిన రహస్య ఆపరేషన్‌కు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది.
