This Day in History: 1966-07-08
1966 : కళైమామణి రేవతి (ఆశా కెలున్ని) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిణి, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషలలొ పనిచేసింది. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు. దక్షిణ భారత చలనచిత్రంలో అత్యంత విజయవంతమైన ప్రముఖ నటీమణులలో ఒకరు.
బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది. సినిమా ఎక్స్ప్రెస్, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఆనంద వికడం ఫిల్మ్, కేరళ స్టేట్ ఫిల్మ్, స్క్రీన్, సైమ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకుంది.
