1942-08-08 – On This Day  

This Day in History: 1942-08-08

Quit India Movement Dayక్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం
(ఇండియా)


క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 8న భారతదేశంలో జరుపుకుంటారు. ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మహత్తర ఘట్టాన్ని సూచిస్తుంది.

1942లో మహాత్మా గాంధీ నేతృత్వంలో ముంబైలోని గౌలియా టాంక్ మైదానంలో ప్రారంభమైన ఈ ఉద్యమం, ‘అంగ్రేజో భారత్‌ చ్ఛోడో’ మరియు ‘చేయండి లేక చనిపోండి’ (Do or Die) నినాదాలతో బ్రిటిష్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది.

దేశవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు, తిరుగుబాట్లలో యువత, విద్యార్థులు, మహిళలు, కార్మికులు భాగస్వామ్యం కాగా, గాంధీ, నెహ్రూ, పటేల్‌ లాంటి నేతల అరెస్టులు జరిగాయి.

కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మాత్రం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు.

ఈ ఉద్యమం స్వాతంత్ర్యానికి దారి సుగమం చేసింది. ఈ రోజు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని గౌరవిస్తాం.

Share