This Day in History: 1957-03-10
1957 : ఒసామా బిన్ లాడెన్ (ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవద్ బిన్ లాడెన్) జననం. సౌదీ అరేబియన్ ఉగ్రవాది. పాన్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ స్థాపకుడు. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO), యూరోపియన్ యూనియన్ మరియు వివిధ దేశాలచే తీవ్రవాద సంస్థగా గుర్తించబడింది. 6 మంది ని వివాహం చేసుకొన్నాడు. బిన్ లాడెన్ తండ్రి యెమెన్‌లోని హధ్రామౌట్‌కు చెందిన సౌదీ బిలీనీయర్ మరియు నిర్మాణ సంస్థ సౌదీ బిన్లాదిన్ గ్రూప్ స్థాపకుడు. ఒసామా ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమైన దాడి ఆల్-ఖైదా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చగా 3000 మంది చనిపోయారు. బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి ఎఫ్.బి.ఐ $25 మిలియన్ల ఇచ్చింది.
