This Day in History: 1993-05-10
1993 : భారతదేశంలోని హర్యానాకి చెందిన సంతోష్ యాదవ్ ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
సంతోష్ 1992 మరియు 1993లో వరుసగా మే నెలలోనే ఈ శిఖరాన్ని ఎక్కింది. అంతే కాదు, కాంగ్‌షుంగ్ తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన ప్రపంచంలోనే మొదటి మహిళ కూడా. ఆమెఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌లో పోలీసు అధికారి. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. ఎవరెస్టును రెండుసార్లు జయించినందున, ఆమెకు కె.కె. బిర్లా ఫౌండేషన్ స్పోర్ట్స్‌కు ప్రత్యేక అవార్డుల ఇస్తామని కూడా ప్రకటించారు. 19 ఏప్రిల్ 2001న, సంతోష్‌ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవించింది.
