This Day in History: 2000-06-10
2000 : మలావత్ పూర్ణ జననం. భారతీయ పర్వతారోహకురాలు. 13 సం.ల 11 నెలల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు. రష్యా మరియు యూరప్‌లోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ 50 అడుగుల పొడవైన భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. 2020లో ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో పూర్ణ జాబితా చేయబడింది. ప్రపంచస్థాయి 7–సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది.
7 ఎత్తైన శిఖరాల్ని అధిరోహించింది.
- మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014)
- మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016)
- మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017)
- మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019)
- Mt Carstensz పిరమిడ్ (ఓషియానియా ప్రాంతం, 2019)
- మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019)
- దెనాలి పర్వత శిఖరం (ఉత్తర అమెరికా, 2022)