This Day in History: 1768-11-11
1768 : సికిందర్ జా, అసఫ్ జా III, నవాబ్ మీర్ అక్బర్ అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్ జననం. హైదరాబాద్ రాజ్యాన్ని 1803 నుండి 1829 వరకు పరిపాలించిన మూడవ నిజాం. రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారుడు. ఈయన కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాద్ అని పేరుపెట్టారు.