This Day in History: 1918-11-11
1918 : మొదటి ప్రపంచ యుద్దం (మహా యుద్ధం, గ్రేట్ వార్, వార్ టు ఎండ్ ఆల్ వార్స్) ముగిసింది.
చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచిపోయిన 1914 జూలై 28న ఐరోపాలో ఉద్భవించిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది పైగా సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు.