This Day in History: 1969-12-11
1969 : పద్మ విభూషణ్ విశ్వనాథన్ ఆనంద్ జననం. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్. ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించిన తొలి భారతీయుడు. గ్రాండ్ మాస్టర్ గా దేశంలో ప్రప్రథముడు. మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించడమే కాక అనేక పర్యాయాలు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న లాంటి అవార్డులు అందుకున్నాడు.