This Day in History: 2004-12-11
2004 : భారతరత్న ఎం ఎస్ సుబ్బలక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, సినీనటి. భారతరత్న, రామన్ మెగసెసే, సంగీత కళానిధి పురస్కారాలు పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ టైమ్స్, మహాత్మాగాంధీ, ఇంగ్లండ్ రాణి లాంటి వారందరి చేత పొగడ్తలు పొందింది. త్యాగరాజు వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోసింది. అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులను పొందింది.