This Day in History: 1984-03-12
1984 : శ్రేయా ఘోషల్ జననం. భారతీయ నేపధ్య గాయని, టెలివిజన్ ప్రెజెంటర్. హిందీ, అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం భాషలలొ పనిచేసింది. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం “దేవదాస్” తో ప్రారంభించింది. జీ టీవీలో ప్రసారమయ్యే “స రె గ మ” (ఇప్పటి స రెగా మ ప) 75వ పిల్లల ప్రత్యేక సంచిక (Children’s special episode) విజేత. ఆనందలోక్ పురస్కారం, ఆనంద వికటన్ సినిమా అవార్డు, వార్షిక సెంట్రల్ యూరోపియన్ బాలీవుడ్ అవార్డు, ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్, ఆసియావిజన్ మూవీ అవార్డ్, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు, బిగ్ బంగ్లా మూవీ అవార్డు, బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు, బాలీవుడ్ హంగామా సర్ఫర్స్ ఛాయిస్ మ్యూజిక్ అవార్డ్, చందనవన ఫిల్మ్ క్రిటిక్స్ అకాడమీ అవార్డు, ఫిల్మ్ ఫేర్లతో సహ అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.
