1765-08-12 – On This Day  

This Day in History: 1765-08-12

1765 : మొఘల్ చక్రవర్తి షా ఆలం II బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివాణి (పన్ను వసూలు) హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేశాడు. దీంతో మొట్టమొదటి సారిగా భారతదేశంలో బ్రిటిష్ రూల్ మొదలైంది. 1608 లో భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార సంస్థ నుండి రాజకీయ పాలక సంస్థగా అవతరించింది. ఇది భారతదేశ చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఘట్టంగా సూచించబడింది. ఆలం షా II  బక్సర్ యుద్ధంలో ఓటమి తరువాత రాబర్ట్ క్లైవ్‌తో అలహాబాద్ ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది.

Share