This Day in History: 3139-10-12
మహారాజా అగ్రసేన్ జయంతి అనేది ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో మొదటి రోజు (BCE 3139) జరుపుకుంటారు. ఆంగ్ల కాలమానం ప్రకారం BCE 3082 సెప్టెంబర్ 15న జన్మించాడు. రాముడి కుమారుడైన కుశుడి వంశం యొక్క 34వ తరానికి చెందినవాడు. అగ్రోహ రాజ్యాన్ని స్థాపించాడు. మహారాజు వల్లభ తన కుమారుడు అగ్రసేన్ పేరు మీద ఒక నగరానికి ‘ఆగ్రా’ అని పేరు పెట్టాడు. ఆయన పేరు మీద అగర్వాల్ (అగ్రవాల్) అనే వంశం ఏర్పడింది. 18 గోత్రాలు సృష్టించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. ఆయనకు 54మంది కుమారులు, 18మంది కుమార్తెలు.