This Day in History: 1944-09-13
1944 : నూర్ ఇనాయత్ ఖాన్ (నూర్ ఉన్ నిసా ఇనాయత్ ఖాన్) మరణం. భారతీయ అమెరికన్ రచయిత, బ్రిటిష్ గూఢచారి. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వారసురాలు. బ్రిటన్ లో తొలి ముస్లిం వార్ హీరోయిన్.
నాజీ-ఆక్రమిత ఫ్రాన్స్‌కు రహస్యంగా ప్రయాణించిన మొదటి మహిళా రేడియో ఆపరేటర్. UKలో బ్లూ ప్లేక్‌తో సత్కరించబడిన మొదటి భారతీయ సంతతి మహిళ. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బ్రిటీష్ యోధురాలు. స్పెషల్ ఆపరేషన్స్ లో ఆమె చేసిన పనికి బాగా ప్రాచుర్యం పొందింది. నూరా బేకర్ అనే పేరు కూడా ఆమె వాడేది. భారతీయ అమెరికన్ వారసత్వాలు కలిగిన నూర్ ఇనాయత్ ఖాన్ రచయితగానూ పేరు పొందింది. స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా ఆమె చేసిన కృషికిగాను మరణానంతరం జార్జ్ క్రాస్ సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నుంచి జర్మనీ ఆక్రమిత ఫ్రాన్సుకు సైన్యంలో ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్ళి పనిచేసిన తొలి మహిళగానూ, బ్రిటన్లో తొలి ముస్లిం వార్ హీరోయిన్ గానూ ఆమె నిలిచింది.