This Day in History: 1946-09-13
1946 : మేజర్ రామస్వామి పరమేశ్వరన్ జననం. భారతీయ సైన్యాధికారి. ఆయన ధైర్యసాహసాలకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర లభించింది. మహార్ రెజిమెంట్ కు చెందిన మేజర్ పరమేశ్వరన్ యూనిట్ ఆపరేషన్ పవన్ లో పాల్గొనేందుకు శాంతిభద్రతల నిర్వహించడానికి శ్రీలంకకు పంపారు. 1987 నవంబరు 25న మేజర్ పరమేశ్వరన్ రాత్రి ఆలస్యంగా గాలింపు చర్యల నుండి తన స్థానానికితో తిరిగి, అకస్మాత్తుగా, తన స్థానంపై తీవ్రవాదులు సమూహం మెరుపుదాడికి పాల్పడ్డారు. సమీపంగా జరిగిన యుద్ధంలో ఒక తీవ్రవాది ఆయన గుండెల్లో కాల్చాడు. గాయానికి భయపడకుండా ఆ తీవ్రవాది నుండి రైఫిల్ తీసుకొని దానితో ఆయను చంపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఆదేశాలను యిస్తూ వారి కమాండెంట్స్ కు స్ఫూర్తిని అందిస్తూ తుదిశ్వాస విడిచాడు.