This Day in History: 1952-12-13
1952 : లక్ష్మీ (ఎర్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి నటి. ఉత్తమ నటిగా ఎనిమిది సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ & ఫిలింఫేర్ అవార్డులను అన్ని ప్రాంతీయ భాషలలో గెలుచుకున్న మొదటి నటి. ఉత్తమ నటిగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి నటి. ‘శ్రీవల్లి’ తమిళ చిత్రం ద్వారా బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ముగ్గురిని పెళ్లి చేసుకుంది. సినీనటి ఐశ్వర్య ఈమె కుమార్తె. నంది, నేషనల్ ఫిల్మ్, తమిళనాడు ఫిల్మ్, కర్ణాటక ఫిల్మ్, కేరళ ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకుంది.