This Day in History: 1879-03-14
1879 : ఆల్బర్ట్ ఐన్స్టీన్ జననం. జర్మనీ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా. క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు.
ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించాడు.
ఆయన కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను పునరుర్ధరించలేదని భావించేవాడు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916 లో సాధారణ సాపేక్షతపై పేపర్ ప్రచురించారు. స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టిపెట్టాడు ఐన్స్టీన్. పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశాడు. ఉష్ణ లక్షణాల గురించి చేసిన పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశాడు ఐన్ స్టీన్.
