This Day in History: 1939-04-14
1939 : గొల్లపూడి మారుతీ రావు జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నాటక రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, టెలివిజన్ ప్రజెంటర్. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ పత్రిక ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.
