This Day in History: 1984-12-14
1984 : రాణా (దగ్గుబాటి రామానాయుడు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు. ఫోర్బ్స్ ఇండియా 100లో స్థానం పొందాడు. టైమ్స్ మోస్ట్ డిజైరాబుల్ మేన్ లో స్థానం, ఈస్టర్న్ ఐ “సెక్సీయెస్ట్ ఆసియన్ మెన్” లో 29వ స్థానంలో నిలచాడు. జిక్యూ ఇండియా యొక్క బెస్ట్ డ్రెస్డ్ మెన్ లిస్ట్‌లో కనిపించాడు. గూగుల్ శోధనలో అత్యధికంగా శోధించబడిన పదకొండవ వ్యక్తి. తెలుగు, హిందీ, తమిళ భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డుతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.