1901-07-15 – On This Day  

This Day in History: 1901-07-15

1901 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సోషలిస్టు, 1వ లోకసభ సభ్యుడు చెలికాని రామారావు జననం.

ఈయన జులై 151901లో నారాయణస్వామి, సూరమ్మ దంపతులకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరంలో జన్మించారు. సంఘ సంస్కరణోద్యమాలు, సాయుధ విప్లవోధమాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లాలోణి అద్వితీయమైన వాతావరణం ప్రభావం బాల్యం నుండే ఆయన పై చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి వ్యక్తిత్వం చిన్నతనంలోనే రామారావును విశేషంగా ఆకట్టుకుంది. రాజావారి సహాయం తోనే రామారావు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు రాసి ఉన్నత పాఠశాలలో ప్రథముడిగా ఇలిచాడు ఉన్నత పాఠశాల జీవితం లోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపిన రామారావు కాలేజీ చదువుకోసం కాకినాడ వెళ్ళేనాటికి థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. దేశం పరిపాలనలో మగ్గిపోతుంటే సుఖంగా కూర్చుని చదువుకోవడం సాంఘిక ద్రోహమని 1921, జనవరి 26న చదువుకు స్వస్తి చెప్పి ఇల్లొదిలి విశాలమైన ప్రజా జీవితం లోకి ప్రవేశించారు. జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో రాజమండ్రిలో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 నిజాం సంస్థానంలో M&S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 1931లో డాక్టరు డిగ్రీ పట్టా పొందారు.తరువాతి రోజుల్లో సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఆయనను బాగా ఆకర్షించాయి. తెలుగునాట సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించిన కందుకూరి వీరేశలింగం పంతులు కూడా ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. 1934 లో కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను రామారావు గారు కులాంతర వివాహం చేసుకున్నారు. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అధ్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి రంగూన్లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ పార్లమెంటు సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) అభ్యర్థిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి సెప్టెంబరు 251985న దివంగతులైనాడు

Share