1902-07-15 – On This Day  

This Day in History: 1902-07-15

1902 : పద్మ భూషణ్ కె ఎల్ రావు (కానూరు లక్ష్మణరావు) జననం. భారతీయ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త. నాగార్జునసాగర్ డేమ్ రూపకర్త. 1962 నుండి 1977 వరకు విజయవాడ పార్లమెంటు సభ్యునిగా మరియు నీటిపారుదల & విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశాడు.

1958-59 మరియు 1959-1960లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ మరియు ఆల్ ఇండియా ఇంజనీర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1957-61 మరియు 1961-65లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ (ఆసియా) వైస్ ప్రెసిడెంట్. 1960లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు సైన్స్‌లో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1968లో రూర్కీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌లో డాక్టరేట్‌ను కూడా ప్రదానం చేసింది.

అనేక భారి ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉంది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలములో అనేక జలవిద్యుచ్ఛక్తి, నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశాడు. ప్రపంచములోనే అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జునసాగర్ ఈయన రూపకల్పన చేసినదే. మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికా కాలములలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టు లకు రూపకల్పన చేశాడు.

 

Share