1909-07-15 – On This Day  

This Day in History: 1909-07-15

1909 : పద్మ విభూషణ్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (బెన్నూరి దుర్గ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు. ఆమె భారత రాజ్యాంగ సభ మరియు భారత ప్రణాళికా సంఘం సభ్యురాలు. మహిళా విముక్తి కోసం ప్రజా ఉద్యమకారిణి. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక అధ్యక్షురాలు. 1962లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ స్థాపించింది. శ్రీ వెంకటేశ్వర కళాశాల , న్యూఢిల్లీ లో స్థాపించింది. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ (AES) ని 1948లో డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు పిల్లల విద్యా అవసరాల కోసం స్థాపించింది. 1953లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్ అయిన CD దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. పాల్ జి హాఫ్‌మన్ అవార్డు, నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో అవార్డు (అక్షరాస్యత రంగంలో అత్యుత్తమ కృషికి),  పద్మవిభూషణ్ అవార్డు, జీవన్ అవార్డు మరియు జగదీష్ అవార్డులను అందుకుంది.

Share