This Day in History: 1582-10-15
1582 : గ్రెగరియన్ క్యాలెండర్ ఆవిష్కరించబడింది. అప్పటి వరకు అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా సూచించారు. మధ్యలో పదిరోజులను తప్పించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.