This Day in History: 1875-11-15
1875 : బిర్సా ముండా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన గిరిజనుడు. భారతదేశ పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటం సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు. రాంచీ విమానాశ్రయానికి బిర్సా పేరు పెట్టారు. పాతికేళ్లు కూడా దాటకుండానే స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా. రాంచీలో బిర్సా ముండా మ్యూజియం ఏర్పాటు చేశారు, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.