This Day in History: 1983-07-16
1983 : కత్రినా కైఫ్ (కత్రినా టర్కోట్) జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, మోడల్, వ్యాపారవేత్త, పరోపకారి, సామాజిక కార్యకర్త. కాస్మెటిక్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ సహ వ్యవస్థాపకురాలు. ఇది నైకా (Nykaa) భాగస్వామ్యంతో ప్రారంభించబడింది. స్లైస్ , నక్షత్రం , లక్స్ , పానాసోనిక్ , లాక్మే మరియు లోరియల్ వంటి అనేక బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాజిడర్. హిందీ, తెలుగు, మళయాళం భాషలలొ పనిచేసింది. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుల్లో ఒకరు. ది ఎకనామిక్ టైమ్స్ 2012లో కైఫ్‌ను భారతదేశం యొక్క రెండవ అత్యంత ప్రముఖ ఎండోర్సర్‌గా పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించే బాలీవుడ్ సెలబ్రిటీలలో పదవ స్థానంలో నిలిచింది. పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ ఇండియా, జీ సినీ, స్టార్ డస్ట్, స్టార్ గిల్డ్, స్క్రీన్, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఐఐఎఫ్ఏఏ, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులను అందుకుంది.
