This Day in History: 2012-09-16
సుత్తివేలు 🔴
(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు)
మరణం.
భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.
నంది అవార్డు గ్రహీత.
ఆయన సన్నని శరీరం కారణంగా పిన్ని ‘వేలు’ అని పిలిచేది.
1982లో విడుదలైన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘సుత్తి’ కావడంతో, ఆ చిత్ర విజయం తర్వాత అందరూ ‘సుత్తివేలు’ అని పిలవడం ప్రారంభించారు.
1981లో ‘ముద్ద మందారం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. దర్శకుడు జంధ్యాల గారి చిత్రాల్లో నటించడం ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు.
సుత్తి వీరభద్రరావుతో కలిసి ‘సుత్తి జంట’గా పిలువబడే హాస్య జోడీగా ప్రసిద్ధి చెందాడు. వీరిద్దరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.