This Day in History: 2022-10-16
2022 : పద్మ విభూషణ్ దిలీప్ మహలనాబిస్ మరణం. భారతీయ శిశు వైద్యుడు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) పితామహుడు. అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని (Oral Rehydration therapy) ప్రవేశపెట్టిన వారిలో ఈయన ఒకడు. 1960లలో కలకత్తాలోని జాన్స్ హాప్కిన్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లో కలరా ఇంకా ఇతర అతిసార వ్యాధులపై పరిశోధన చేసాడు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి వచ్చి పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్న శరణార్థులలో కలరా విజృంభించింది. అప్పుడు ఈయన నేతృత్వంలో జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ పరిశోధకుల బృందం ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని వారిపై వాడి, అది ప్రాణాలను ఎలా నిలబెట్టగలదో చూపించింది.