This Day in History: 1790-04-17
1790 : బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం. అమెరికన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, రాజకీయ తత్వవేత్త. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపక పితామహులలో ఒకడు. అమెరికా దేశపు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డ్రాఫ్ట్ చేసిన వారిలో ఒకడు, ఆ పత్రంపై సంతకం చేసిన వ్యక్తి. మొట్ట మొదటి యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ మాస్టర్ జనరల్. శాస్త్రవేత్తగా, అమెరికన్ ఎన్లైటెన్మెంట్ మరియు భౌతిక శాస్త్ర చరిత్రలో విద్యుత్తుకు సంబంధించిన ఆవిష్కరణలు మరియు సిద్ధాంతాలకు ప్రధాన వ్యక్తి. పెన్సిల్వేనియా 6వ అధ్యక్షుడు.
