1922-03-18 – On This Day  

This Day in History: 1922-03-18

1922 : బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన చర్యకు పాల్పడినందుకు మహాత్మా గాంధీకి  దేశద్రోహం నేరం క్రింద 6 సంవత్సరాల శిక్ష విధించింది.మార్చి 10, 1922 న గాంధీజీ దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు. బ్రిటీష్ వారు గాంధీజీ యంగ్ ఇండియాలో ప్రచురించిన మూడు కథనాలను అతని దేశద్రోహానికి ఆధారం చేశారు. మార్చి 18, 1922 న, న్యాయమూర్తి బ్రూమ్ ఫీల్డ్ కేసును విచారించి, దేశద్రోహ నేరానికి గాంధీజీకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించాడు.  జైలులో ఉన్న సమయంలో, గాంధీ తన ఆత్మకథలో మొదటి భాగం ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ మరియు దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమం గురించి రాశాడు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న ఆయన రెండేళ్ల తర్వాత విడుదలయ్యాడు.

Share