This Day in History: 1861-07-18
1861 : కాదంబినీ గంగూలీ (కాదంబినీ బోస్ గంగూలీ) జననం. భారతీయ మహిళా వైద్యురాలు. భారతదేశంలో డిగ్రీ పొందిన మొదటి భరతీయ మహిళ. భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళ.
దక్షిణాసియా మొత్తంలో పాశ్చాత్య వైద్యాన్ని అభ్యసించిన మొదటి మహిళ. ఆధునిక వైద్యంలో డిగ్రీతో ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళ. కలకత్తా మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందిన మొదటి మహిళ. స్కాట్లాండ్‌లో శిక్షణ పొంది, భారతదేశంలో విజయవంతమైన వైద్య విధానాన్ని స్థాపించింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌లో మొదటి మహిళా స్పీకర్. బెంగాలీ పేపర్ లో ఆమెను వేశ్య అని రాయగా ఎడిటర్ కి 6 నెలలు జైలు శిక్ష పడింది.