This Day in History: 1918-07-18
1918 : భారతరత్న నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా జననం. దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక విప్లవకారుడు, రాజకీయవేత్త, పరోపకారి. దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు.
ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఉంకోంటో విసిజ్వే లకు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో 27 సంవత్సరాలు “రోబెన్” అనే ద్వీపంలో కారాగార శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. అనేక అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.