This Day in History: 1893-09-18
వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అనేది భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి రోజు హిందువులు జరుపుకొనే వేడుక. 1893లో బాల గంగాధర తిలక్ చే ఇది గుర్తించబడింది. ఇంట్లో జరుపుకొనే ఈ పండుగను ఛత్రపతి శివాజీ మొదటిసారిగా ఘనంగా పుర వీధుల్లో జరిపించాడు. తరవాత బ్రిటీష్ వారు బహిరంగ సామాజిక, రాజకీయ సమావేశాలను నిషేధించిన సమయంలో ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి తిలక్ దీనిని సామాజిక పండుగగా మార్చి 10 రోజులు బహిరంగంగా జరుపుకోవాలని సూచించాడు. ఈ పండుగ అన్ని కులాలు మరియు వర్గాల సాధారణ ప్రజలకు ఒక సమావేశ స్థలంగా పనిచేసింది. ఇది స్వాతంత్ర్య ఉద్యమ ఆరంభనికి నాంది పలికింది. శాతవాహనులు, రాష్ట్రకూట, చాళుక్య రాజవంశాలు పాలించిన కాలంలో అంటే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీ.శ. 1190 వరకు గణేష్ చతుర్థి ఉత్సవాల ప్రారంభ సందర్భాలు ఉన్నాయని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.