This Day in History: 1947-06-19
1947 : అహ్మద్ సల్మాన్ రష్దీ జననం. భారతీయ అమెరికన్ నవల రచయిత, వ్యాసకర్త, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. టైమ్స్ 1945 నుండి 50 మంది గొప్ప బ్రిటీష్ రచయితల జాబితాలో ఆయనకి 13వ స్థానం ఇచ్చింది. నైట్ హుడ్ గౌరవం లభించింది. గోల్డెన్ పెన్ అవార్డు, హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ లిటరేచర్ అవార్డ్, కల్చరల్ హ్యూమనిజం (హార్వర్డ్ యూనివర్సిటీ) లో అత్యుత్తమ జీవితకాల సాఫల్యం, PEN పింటర్ ప్రైజ్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ లైబ్రరీ అసోసియేట్స్ నుండి సెయింట్ లూయిస్ లిటరరీ అవార్డు, సాహిత్యానికి రాష్ట్ర బహుమతి (ఆస్ట్రియా), స్విస్ ఫ్రీథింకర్స్ అవార్డ్ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.